Telangana : రేపు మీనాక్షి నటరాజన్ రాక.. పార్టీ నేతల్లో హడావుడి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తన మార్కు విధి నిర్వహణను షురూ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై దృష్టి సారించిన ఆమె ఈ నెల 4న మరోసారి హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్ లో జరిగే మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొన నున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థా గతంగా పార్టీ పటిష్టత, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com