Madhapur Mega Job Mela : డిసెంబర్ 28న మాదాపూర్‌లో మెగా జాబ్ మేళా

X
By - Manikanta |26 Dec 2024 12:15 PM IST
మాదాపూర్‌లోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో డిసెంబర్ 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జాబ్ మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ ఇంజినీర్ వెల్లడించారు. ఫార్మా, హెల్త్, ఐటీ, ఎడ్యుకేషన్, బ్యాంక్స్‌తో పాటు ఇతర రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను కూడా అందిస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తదితర వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com