Telangana : వాతావరణశాఖ తీపికబురు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు

సూర్యుడి ఉగ్రరూపంతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో మంగళవారం నుంచిఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుముఖం పడతాయని తెలిపింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతల కంటే క్రమేపి 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వెల్లడించింది. తెలంగాణలో మూడు రోజులపాటు పొడివాతావరణం ఏర్పడుతుందని వెల్లడించింది. ఈ మూడు రోజులపాటు ఎండలు దంచికొడ -తాయని వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ అగ్నిగుండంలా మారింది. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి భగభలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జనవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక మార్చి తొలి వారం నుంచే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మధ్యలో ఓ వారం పాటు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా మళ్లీ సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరం అయితేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని, వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com