TG : ఫిజికల్ సెక్యూరిటీ ఉద్యోగులకు కనీస వేతనం ఇస్తం : భట్టి విక్రమార్క

ఫిజికల్ సెక్యూరిటీలో పని చేసే వారికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని, వారికి కనీస వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నగర భద్రతలో సెక్యూరిటీ సంస్థలను భాగస్వామ్యం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయన్నారు. నిధులు అవసరం ఉన్న ప్రతి చోట ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తున్నదన్నారు. పోలీస్ శాఖ ప్రైవేట్ సెక్యూరిటీలపై ఫోకస్ పెట్టాలని భట్టి విక్రమార్క సూచించారు. ప్రైవేట్ ఏజెన్సీలు అందరూ తప్పనిసరిగా లైసెన్స్ లు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న రాష్ట్ర పోలీసులను ఆయన అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com