విద్యుత్‌ వినియోగంలో మనమే ప్రథమం: మంత్రి జగదీష్‌ రెడ్డి

విద్యుత్‌ వినియోగంలో మనమే ప్రథమం: మంత్రి జగదీష్‌ రెడ్డి
X
విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ యావత్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ యావత్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని వట్టిఖమ్మం పహాడ్‌ సబ్‌స్టేషన్‌లో జరిగిన విద్యుత్‌ ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చితే.. తెలంగాణ రాష్ట్రంలో 69 శాతం విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ రోజున కేవలం 7వేల 778 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఉంటే.. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో ఇవాళ 18వేల 567 మెగావాట్లకు చేరిందన్నారు.

Tags

Next Story