Minister Jupalli : విద్యార్థులతో కలిసి నిద్ర చేసిన మంత్రి జూపల్లి

Minister Jupalli : విద్యార్థులతో కలిసి నిద్ర చేసిన మంత్రి జూపల్లి
X

అది దట్టమైన అడవి. సెన్సిటివ్ జోన్. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండవు. ఎటు చూసినా అడవే. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిద్ర చేశారు. అధికారులు వద్దని వారించినా… ససేమిరా అన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, సౌకర్యాల కల్పన కోసం అక్కడే బస చేశారు ఉమ్మడి జిల్లా చరిత్రలో మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతిగృహంలో ఓ మంత్రి రాత్రి బస చేయడం ఇదే మొదటిసారి.

Tags

Next Story