Minister Jupally :ఆ పాటతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన మంత్రి జూపల్లి,

సినిమా పాటతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. వినూత్న శైలిలో విద్యార్థుల్లో ఉత్సాహం నింపాలన్న ఆయన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీతో పాటు ఆదిలాబాద్‌లోని పలు కళాశాలలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ..తన సెల్ ఫోన్ లో సినిమా పాటను ప్లే చేసి స్టూడెంట్స్ కు వినిపించారు మంత్రి. దివంగత నటుడు శ్రీహరి నటించిన ‘భద్రాచలం’ సినిమాలోని “ఒకటే జననం.. ఒకటే మరణం.. గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు” అనే పాటన ప్లే చేసి వినిపించారు. ఈ పాటలోని సందేశం విద్యార్థులను బాగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఆత్మహత్య పరిష్కారం కాదని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు ఆరోగ్యం, క్రీడలపైనా దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వెంటనే స్పందించి, ఆర్జీయూకేటీ, గురుకుల పాఠశాలకు క్రీడా కిట్లను మంజూరు చేశారు. మంత్రి ప్రసంగం, ఆయన పాట ద్వారా ఇచ్చిన సందేశానికి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com