నేషనల్ హైవేల నిర్మాణాలను ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి : మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. సోమవారం సచివాలయంలో జాతీయ రహదారులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్మాణ స్థితిగతులపై ఆరాతీసి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఎన్‌హెచ్-65ని ఆరు లేన్లుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఎన్‌హెచ్-65పై 422.12 కోట్లతో చేపట్టిన 17 బ్లాక్ స్పాట్ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టేందుకు అపాయింటెడ్ డేటను వారంలో ఖరారు చేస్తామన్నారు. నాగపూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందన్నారు. రైతుల భూములకు మంచి ధరను ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com