Minister Komatireddy : అల్లు అర్జున్ ఇంటిపై దాడి మీద మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్

X
By - Manikanta |23 Dec 2024 4:45 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వివాదం ముదిరి సీఎంపై హీరో అల్లు అర్జున్ చేసిన విమర్శలు ఆయన్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. జూబ్లిహిల్స్ లోని ఆయన ఇంట్లోకి ఆదివారం ప్రవేశించిన ఓయూ జేఏసీ నేతలు... అక్కడ విధ్వంసం సృష్టించారు. టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూలకుండీలు పగలగొట్టారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని నినాదాలు చేస్తూ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు. సంధ్య థియేటర్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com