TG : వరంగల్ మార్కెట్‌లో ఓ మాఫియా దందా : మంత్రి కొండా సురేఖ

TG : వరంగల్ మార్కెట్‌లో ఓ మాఫియా దందా : మంత్రి కొండా సురేఖ
X

వరంగల్ మార్కెట్‌లో ఓ మాఫియా దందా చేస్తోందని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనర్హులకు మార్కెట్ లో షాపులను కేటాయించారన్నారు. మంగళవారం వరంగల్ లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించి మార్కెట్‌లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూరగాయల మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోందన్నారు. అనర్హులను గుర్తించి తిరిగి షాపులను స్వాధీనం చేసుకుంటామన్నారు. చిరు వ్యాపారులను గుర్తించాలన్నారు. లైసెన్స్ ఇచ్చి మార్కెట్‌లో చోటు కల్పించాలన్నారు. గత సెక్రటరీ కేటాయించిన దుకాణాల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌లో పార్కింగ్‌తో పాటు మౌళిక సదుపాయలు కల్పిస్తామన్నారు.

Tags

Next Story