Teacher Posts : త్వరలోనే మరో 11 వేల టీచర్ పోస్టులు : మంత్రి కొండా సురేఖ

గత పాలకులు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని, ఆదాయ వనరుగా ఉన్న రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే..సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నాడని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ ఉమామహేశ్వర ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా మాధవ రెడ్డి తో పాటు.. 16 మంది డైరెక్టర్లను,ఆలయ అధికారులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పదవులనేటివి అందరికీ రావని వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏ నాయకుడు కూడా అధికారం రాగానే ప్రజలను విస్మరించరాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు మంచి సలహా ఇవ్వాలని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ హరీశ్ రావులను ఉద్దేశించి మండిపడ్డారు. కావాలని అధికార పార్టీ పై బురద చల్లే పనిలో ఉన్నారని విమర్శలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com