TG : గ్యారంటీల అమలుపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్

TG : గ్యారంటీల అమలుపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్
X

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. ఈనెల 19న హన్మకొండ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కాలేజీలో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ సభ, మహిళా సభలో తమ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. అలాగే అదే రోజు ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి కొత్తగా చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఇందిరా శక్తి భవన్, మమూనూర్ ఎయిర్ పోర్టు వంటి పథకాల పనులను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.

Tags

Next Story