ఈటల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా : కేటీఆర్

ఈటల ఎపిసోడ్‌పై మంత్రి KTR మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు TRS ఎంత ఇచ్చిందో ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అసలు పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయం ఏంటో కూడా చెప్పాలన్నారు. మంత్రిగా ఉంటూనే కేబినెట్ నిర్ణయాలను ఈటల తప్పు పట్టారని KTR అన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌పై సానుభూతి రాదన్నారు. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఎవరో అనామకుడు KCRకు ఉత్తరం రాస్తే చర్యలు తీసుకోలేదని, ఈటల ఆత్మవంచనతో మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్ల నుంచి KCRతో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఐదేళ్లుగా ఈటల అడ్డంగా మాట్లాడినా ఆయన్ను KCR మంత్రిగానే కొనసాగించారని చెప్పారు. ఈటల పార్టీలో ఉండాలని చివరివరకూ తాను వ్యక్తిగతంగా ప్రయత్నం చేశానన్నారు కేటీఆర్. సీఎంను కలవను అని చెప్పేశాక ఎవరైనా ఏం చేయగలరన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ బలంగానే ఉందని, తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో వ్యక్తుల మధ్య పోటీ కాదని పార్టీల మధ్యేనని స్పష్టం చేశారు.
అటు జల వివాదాల్లో న్యాయమే గెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఏపీ ఎన్ని కేసులు వేసినా.. న్యాయబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. ఒక్కో వారంలో కొందరు ఒక్కో వ్రతం చేస్తారని.. అలా ఇప్పుడు షర్మిల చేస్తోందన్నారు కేటీఆర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడగలుగుతామని.. ప్రతిపక్ష నేతలకు ఏం మాట్లాడాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com