మరోసారి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

మరోసారి రేవంత్ రెడ్డిపై  ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి
జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కార్పొరేటర్‌ కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కార్పొరేటర్‌ కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇతర పార్టీలనుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మల్లారెడ్డి . ఈ సందర్భంగా ఆయన మరోసారి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే రేవంత్‌ రెడ్డి నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిని తిడతారా అంటూ తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోయారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని 50 కోట్లతో తెచ్చుకున్న వ్యక్తి.. సీఎం కేసీర్‌ను తిట్టడం ఎంటన్నారు. రేవంత్ కు ప్రజలే తగినరీతిలో బుద్ధిచెబుతారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story