TG : కుల వృత్తులను ప్రోత్సహిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

TG : కుల వృత్తులను ప్రోత్సహిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యంలో 100 శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం వద్ద ఎంపీ రఘురామ్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీష్ చైర్మన్ సాయి, ఐటీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. భారీ వరదల వల్ల మత్యకారులు తీవ్రంగా నష్ట పోయారని, మత్యకారులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తీరుస్తుందని హామీ ఇచ్చారు.

Tags

Next Story