Fake Videos : ఫేక్​ వీడియోలపై చర్యలు తీసుకోండి : మంత్రి పొన్నం

Fake Videos : ఫేక్​ వీడియోలపై చర్యలు తీసుకోండి : మంత్రి పొన్నం
X

ఫేక్​ వీడియోలు సోషల్​ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బదులు ఇస్తూ.. ఈ కామెంట్స్​ చేశారు. కేటీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఇబ్బందేమీ లేదని, కానీ సమాజిక మాధ్యమాల్లో కొందరు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు. గురువారం సభలో సహచర సభ్యుడితో మాట్లాడుతున్న సమయంలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారని, ఇది ఒక్కటే కాదు.. గిరిజన మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టి అవమానపరుస్తున్నారని, సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఉంటున్నాయనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. సభా కార్యక్రమాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం కోరారు.

Tags

Next Story