TG : కాంగ్రెస్ ఏం చేసినా..బీఆర్ఎస్కు కళ్లు మండుతున్నాయ్ : మంత్రి పొన్నం

సీఎం రేవంత్ రెడ్డి అమెరిక టూర్ వ్యక్తిగతం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా బీఆర్‌ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హన్మకొండలోని భీమదేవరపల్లిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందోనని అసూయతోనే బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతల అసహనానికి హద్దు లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని.. రెండూ ఒక్కటేనని ఆరోపించారు.
బాద్యులపై కఠిన చర్యలు
సుంకేసుల ఘటనపై సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నం తెలిపారు. సాంకేతికపరమైన నివేదికలతో ప్రజల ముందుకు వస్తామన్నారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. బీఆర్ఎస్ నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com