TG : విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించండి: మంత్రి పొన్నం

TG : విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించండి: మంత్రి పొన్నం
X

తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్కూళ్లలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల హైట్, వెయిట్ రికార్డు చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలి. ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల శుభ్రత, తరగతి గది హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకి అవగాహన కల్పించాలి. పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్-డి లాంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలో ఆవరణలో శుభ్రంగా ఉంచాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు.

Tags

Next Story