Minister Ponnam : ఉగాదికి సన్నబియ్యం.. మంత్రి పొన్నం గుడ్ న్యూస్

Minister Ponnam : ఉగాదికి సన్నబియ్యం.. మంత్రి పొన్నం గుడ్ న్యూస్
X

ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేలా కార్యచరణను సిద్ధం చేసిందని, ఈ కార్యక్రమాన్ని మొదట నల్గొండ జిల్లా నుంచి ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్షాపుల్లో లబ్ధిదా రులకు సన్నబియ్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గ అభివృద్ధి పై సిద్దిపేట, కరీంనగర్, "హనుమకొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నా రు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్కార్డులు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు అందిన రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి రానున్న అతి కొద్ది రోజుల్లోనే పేదలకు కొత్త రేషన్ కార్డులను ఇస్తామన్నారు. ' వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రా మాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి. ఇందులో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించి వరి కోతలు జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టుతున్న రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం అయిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల తెలంగాణ ప్రభుత్వము హుస్నాబాద్ నియోజకవర్గధి సమీక్షా సమావేశము అప్లికేషన్ ల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. గ్రామాల్లో మంచి నీటి సమస్య రావద్దు.. ఏదైనా సమస్య వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి సమస్య మీరు పరిష్కారం చేయకుండా మా దృష్టికి తెకుండా ప్రొటెస్ట్ చేస్తే మీరే బాధ్యులు. గ్రామాల్లో వేసవి కాలం అధి గమించడానికి టెంపరరీ గా బావులు తీసుకోవాలి. మోటార్లు పెట్టి పైపులు వేయాలి. అవసరమైతే వాటర్ ట్యాంక ర్ల ద్వారా నీరు అందించాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వద్దు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Tags

Next Story