Minister Ponnam : ప్రజలకు అలర్ట్.. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొన్నం

హైదరాబాద్ నగర ప్రజలకు అలర్ట్ జారీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, సీపీ సివి ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. హైదరాబాద్ లో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ బృందాలను ఉంచాలని సూచించారు.మ్యాన్ హోల్స్ నాళాల వద్ద నీరు జామ్ అయితే వెంటనే సమాచారం అందించాలని ...ప్రజలు కూడా అధికారులకు తమ సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆయన పోస్ట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com