TG : తెలంగాణలో 30 శాతం సర్వే కంప్లీట్ : మంత్రి పొన్నం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన సర్వేను చేపట్టుతుందని మంత్రి పొన్నం ప్రభా కర్ అన్నారు. ఇవాళ సిటీలోని ఎన్బీటీ నగర్ లోని జరుగుతున్న సర్వేను మేయర్ గద్వాల వి జయలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఇంటింటి సర్వేలో భాగంగా బంజారాహిల్స్లో మహమ్మ దనయీం అనే వ్యక్తి ఫ్యామిలీ సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం స్వయంగా నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. ' ప్రజలందరూసర్వేను సహకరించాలి. గతంలో ఏ ప్రభు త్వం చేయని బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కార్ స్టార్ట్ చేసింది. అధికారులు తీసుకుం టున్న వివరాలను చాలా గోప్యంగా ఉంచుతాం. ఈ విషయంలో ఎవరు అందోళన చెందాల్సిన అవసరం లేదు. వెల్పేర్ స్కీంల్లో ఎలాంటి కోత ఉండదు. ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువ చ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం సర్వేను కంప్లీట్ చేశాం.
ఆఫీసర్లు స్పీడప్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4 లక్షల 50 వేలకు పైగా ఇండ్లల్లో సర్వే జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎక్కడా ఇబ్బంది లేదు. ఎక్కడైనా ఇబ్బంది ఉండే అధికారులు జిల్లా కలెక్టర్ లను సంప్రదించాలి. మీ డౌట్స్ ను నివృత్తి చేసుకోవాలి.' అని పొన్నం అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com