Ponnam Prabhakar : రోడ్డు పక్క పంచాయతీ సిబ్బందితో మంత్రి పొన్నం ముచ్చట

Ponnam Prabhakar : రోడ్డు పక్క పంచాయతీ సిబ్బందితో మంత్రి పొన్నం ముచ్చట
X

పంచాయతీ సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ నుంచి తాహెర్ కొండాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో చెర్ల భుత్కూరు వద్ద గ్రామ పంచాయతీ సిబ్బందితో మంత్రి ముచ్చటించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని జీతాలు సరిగ్గా రావడం లేదని మంత్రి దృష్టికి పంచాయతీ సిబ్బంది తీసుకొచ్చారు. వెంటనే గ్రామ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్‌తో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Tags

Next Story