Digital Family Card : ప్రతి ఫ్యామిలీకి డిజిటల్ కార్డ్... మంత్రి పొన్నం ప్రభాకర్

Digital Family Card : ప్రతి ఫ్యామిలీకి డిజిటల్ కార్డ్... మంత్రి పొన్నం ప్రభాకర్
X

ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో హేర్ కొండాపూర్లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని రవాణా బీసీ సంక్షేమ మంత్రి పాన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్వయంగా తాహేర్ కొండాపూర్ గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య గుర్తింపు ఫోటో తదితర వాటి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆధార్ కార్డు వలె ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందన్నారు.

ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛను, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయని అన్నారు మంత్రి పొన్నం. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రారంభిస్తున్నారని వివరించారు. రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాల్లో 288 చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కోసం ఒక గ్రామం, మున్సిపాలిటీలో ఒక వార్డ్ పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు. ఎంత మంది పౌరులున్నా కుటుంబం పరంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందని అన్నారు

Tags

Next Story