TG : ఒక్క మెసేజ్ చేయండి.. ట్రబుల్ షూట్ చేస్తా.. పొన్నం ప్రకటన

TG : ఒక్క మెసేజ్ చేయండి.. ట్రబుల్ షూట్ చేస్తా.. పొన్నం ప్రకటన
X

సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం తరపున 500 రూపాయల బోనస్ తప్పకుండా ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయకుంటే.. రైతులు తనకు ఒక SMS చేస్తే స్పందిస్తానని చెప్పారు మంత్రి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొతారం (ఎస్) లోని ఆర్కే జన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 8% తేమ లోపల ఉన్న పత్తికి 7వేల 500 రూపాయల కనీస మద్దతు ధర పలుకుతోందని.. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన నంబర్ కు ఒక్క మెసేజ్, కాల్ చేసినా సమస్య పరిష్కరిస్తానని పొన్నం చెప్పారు.

Tags

Next Story