TG : నయీం ఫ్యామిలీ వివరాలు సర్వేలో నమోదు చేసిన మంత్రి పొన్నం

సమగ్ర కుటుంబ, కులగణన సర్వేలో భాగంగా మహ్మద్ నయీం కుటుంబ సభ్యుల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నమోదు చేశారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఎన్‌క్లేవ్ అపార్ట్మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మితో కలిసి మంత్రి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి వివరాలు నమోదు చేశారు. ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. సర్వే విషయంలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఎక్కడా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ సర్వే దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం సర్వే పూర్తైందని చెప్పారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు.. ఇంకా పథకాలు అమలవుతాయి.. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com