Ponnam Prabhakar : తప్పతాగి నడిపితే కఠిన చర్యలు.. పొన్నం ప్రభాకర్ వార్నింగ్

Ponnam Prabhakar : తప్పతాగి నడిపితే కఠిన చర్యలు.. పొన్నం ప్రభాకర్ వార్నింగ్
X

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సారధి వాహన్ పోర్టల్పై ఆయన అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పోర్టల్ లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామి అయిందని తెలిపారు. ఇందులో భాగంగా 12 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్ చేశామని తెలిపారు. ప్రైవేటు వాహనాల వాలంటరీ స్క్రాపింగ్ పాలసీలో భాగంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ట్యాక్స్ మినహాయింపును ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల కేటాయింపు పారదర్శకంగా జరిగేందుకు 37 ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపిన 8 వేల మంది డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేశారని మంత్రి తెలిపారు.

Tags

Next Story