అజయ్‌ అన్న మనుషులంటే వణకాల్సిందే.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

అజయ్‌ అన్న మనుషులంటే వణకాల్సిందే.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
అజయ్ అన్న మనుషులంటే.. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎస్సైలు.. వణుక్కుంటూ పనిచేస్తారంటూ హాట్‌ కామెంట్స్‌

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శనివారం రఘునాథపాలెం మండలం రాంక్యతండాలో జరిగిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పువ్వాడ పాల్గొన్నారు.

ఈ క్రమంలో మాట్లాడుతూ ఖమ్మంలో కొత్త బిచ్చగాళ్లు వచ్చారని విమర్శించారు. అలాగే అజయ్ అన్న మనుషులంటే.. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎస్సైలు.. వణుక్కుంటూ పనిచేస్తారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. మీరు అజయ్ అన్న మనుషులు.. ' నేను మంత్రిగా ఉంటే మీరు మంత్రిగా ఉన్నట్లే.. పేరు పెట్టి పిలిచేవారంతా నా మనుషులేనన్నారు' మంత్రి అజయ్‌. గద్దె దించుతామని.. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమంటూ కొందరు కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story