KTR : కేటీఆర్‌పై మండిపడ్డ మంత్రి సీతక్క

అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. అమృత్ అనేది కేంద్ర పథకమని చెప్పారు. తప్పులు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం బంధువుగా ఆరోపిస్తున్న సృజన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితతో కలిసి లిక్కర్ వ్యాపారం చేశారన్నారు. ఆయనపై లిక్కర్ కేసులో ఆరోపణలున్నాయన్నారు. మరోవైపు హైడ్రాను కూడా కావాలనే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, ఇటీవల అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. మోసపూరితంగా రేవంత్ రెడ్డి తన బంధువులకు కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికే కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించి సీరియస్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com