Seethakka : ఫారెస్ట్​ ఆఫీసర్లకు మంత్రి సీతక్క వార్నింగ్​

Seethakka : ఫారెస్ట్​ ఆఫీసర్లకు మంత్రి సీతక్క వార్నింగ్​
X

ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. గురువారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని హితవు పలికారు. పోడు భూములపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొమురంభీం ప్రాజెక్ట్‌ ను టూరిజంపరంగా అభివృద్ధి చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆడవాళ్ల జోలికి వస్తే ఎవర్నీ వదలం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

Tags

Next Story