Minister Sridhar Babu : 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీని ద్వారా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. 2లక్షల ఉద్యోగాలు కల్పించినా.. మరో 20 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గ్రాడ్యుయేట్లలో కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని.. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలతో చర్చించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు.
10వేల మందికి శిక్షణ
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. ‘అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని మంత్రి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com