Sridhar Babu : ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ

దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్-డిఫెన్స్ హబ్‌గా తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇటలీకి చెందిన పారిశ్రామికవేత్తలతో సచివాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ముఖ్యంగా, కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్‌లో పెట్టుబడులకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ రంగంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏవియానిక్స్, రాడార్, సెన్సార్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
న్యూ-స్పేస్, చిన్న ఉపగ్రహాల తయారీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అధునాతన పదార్థాలు, కంపోజిట్స్ తయారీలోనూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణలో ఉన్న అనుకూల పారిశ్రామిక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని శ్రీధర్ బాబు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com