Minister Konda Surekha : అడవి జంతువులను దత్తత తీసుకున్న మంత్రి సురేఖ

వన్య ప్రాణులు, జంతువులను కాపాడుకునేందుకు స్వచ్చంద సంస్థలు ముందుకురావాలని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్క్ లోని నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా, అడవి దున్నలను ఒక్కొటి చొప్పున నాలుగింటిని ఆమె మంగళవారం నాడు దత్తత తీసుకున్నారు. కాకతీయ జూ పార్క్ అసిస్టెంట్ క్యురేటర్ మయూరి హన్మకొండ రాంనగర్ లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వచ్చి వన్యప్రాణల దత్తత ప్రక్రియను పూర్తి చేశారు. సంవత్సర కాలానికి
ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం రూ.50 వేల చొప్పున మొత్తం నాలుగు వన్యప్రాణులకు కలిపి 2 లక్షల రూపాయలను మంత్రి సురేఖ ఆన్ లైన్ లో చెల్లించారు. జూల లోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ప్రేమికులు, జంతు ప్రేమికులు ముందుకురావాలని పిలుపునిచ్చారు.
వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న పక్షులు, తాబేళ్లు మొదలు పులుల వరకు మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున దత్తత తీసుకుని, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చిన మంత్రి సురేఖ తెలిపారు. జంతు ప్రేమికులు అటవీ అధికారులను సంప్రదించి వన్య ప్రాణుల దత్తతకు సంబంధించిన మార్గదర్శ కాలను అనుసరించి, వారి వారి ఇష్టానుసారం జంతువులను దత్తత తీసుకునే వెసులుబాటును అటవీశాఖ కల్పిస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వన్యప్రాణుల దత్తత కోసం చేసిన చెల్లింపులకు ఆదాయ పన్ను మినహాయింపు, ఇతర ప్రయోజ నాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అటవీ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com