Minister Tummala Nageswara Rao : ప్రతి మహిళలకు చీరలు ఇస్తం..

Minister Tummala Nageswara Rao : ప్రతి మహిళలకు చీరలు ఇస్తం..
X

రామన్నపేటను కొత్త మార్కెట్‌గా పునరుద్ధరణ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని అమలు చేయలేదు.. దీంతో సహకార సంఘాలు కోట్ల రూపాయలు నష్టపోయాయని అన్నారు. చేనేతకు పెండింగులో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. చేనేత ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు చీరలు ఇస్తాం.. చేనేత వృత్తి మీద బ్రతికే కుటుంబాల కోసం వాళ్ళ అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని అన్నారు. మరోవైపు.. వడ్ల కొనుగోలులో మిల్లర్స్‌తో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ ఛార్జీలు పెంచామని తెలిపారు. రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

Tags

Next Story