TG : రైతు భరోసాపై మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

TG : రైతు భరోసాపై మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
X

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.

హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

Tags

Next Story