Khammam Development : ఖమ్మంను అన్ని విధాలుగా డెవలప్ చేస్తా : మంత్రి తుమ్మల

Khammam Development : ఖమ్మంను అన్ని విధాలుగా డెవలప్ చేస్తా : మంత్రి తుమ్మల
X

సీఎం రేవంత్​రెడ్డి చొరవతో ఖమ్మం జిల్లాను అన్ని విధాలుగా డెవలప్​చేసి ఇతర పట్టణాలనకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్‎లో రూ. కోటి‌తో నిర్మించనున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో తాను మంత్రిగా ఉన్నకాలంలో నగరానికి కోట్లది రూపాయాలు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. రాబోయే కాలంలో అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. మున్నేరు వరద, చెరువుల నుంచి వచ్చే వరద పట్టణాన్ని ముంచే పరిస్థితి మరోసారి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి డిజైన్ చేసేందుకు నిపుణుల కమిటీని నియమించమని సీఎంను కోరామని వెల్లడించారు. డ్రైనేజీ కాలువల డిజైన్ సైతం పక్కాగా ఉండాలని, కాల్వల నిర్మాణం చివరి వరకు వెళ్లే విధంగా చూడాలని, వీటి నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావద్దని ఇంజనీర్లను ఆదేశిస్తున్నానన్నారు. నాలాల ఆక్రమణలను తొలగించే సమయంలో అంతా మానవతా దృక్పథంతో ఉండాలని, ఆక్రమణలలో ఉన్న పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు మరో చోట అందించి, వారిని తరలించిన తర్వాత ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించిన తర్వాతనే నిర్మాణ పనులు స్టార్​చేయాలని, ఖమ్మంలో వరద నివారణ చర్యలకు ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారు ఒకే చోట చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్​స్కూల్స్​నిర్మిస్తుందని తెలిపారు.

Tags

Next Story