TG : సీతారామ లిఫ్ట్ కెనాల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

TG : సీతారామ లిఫ్ట్ కెనాల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల
X

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కెనాల్ లోని రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్ట రాగమయితో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెనాల్ కు భూమి ఇచ్చిన రైతులను తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైరా, మధిర, సత్తుపల్లి ప్రాంత రైతుల కోసం రాజీవ్ లింకు కెనాల్ నిర్మాణం చేపట్టామని అన్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంగా జిల్లా అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు.

Tags

Next Story