TG : త్వరలో రైతు భరోసా.. -రూ.7500 రైతుల అకౌంట్లలో జమ చేస్తాం : మంత్రి తుమ్మల

TG : త్వరలో రైతు భరోసా.. -రూ.7500 రైతుల అకౌంట్లలో జమ చేస్తాం : మంత్రి తుమ్మల
X

కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే రూ. 31 వేల కోట్ల రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం నల్లగొండ ఎస్ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత 5 ఏళ్లలో రైతులు ఏ బ్యాంకులో ఎంత రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకూ 22 లక్షల రేషన్ కార్డులు కలిగిన రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి రేషన్ కార్డులు మిగిలిన 4 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. రూ. 2 లక్షల పైన రుణాల మాఫీపై షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట కాలంలోనే రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Tags

Next Story