Loan Waiver : రుణమాఫీ వివరాలు యాప్ లో పెడ్తాం : మంత్రి తుమ్మల

టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీ ఆగిన రైతులందరికీ మాఫీ అయ్యేలా యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఇదే సమయంలో కలెక్టరేట్‌లో రుణమాఫీపై సమీక్ష నిర్వహించి బయటకు వస్తున్న మంత్రి తుమ్మల కారును ఆందోళనకారులు అడ్డగించారు. దీంతో కారు దిగి వచ్చిన మంత్రి ఆందోళనకారులతో మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని రైతు సంఘాల నాయకులకు ఆయన హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రుణమాఫీ కాని రైతులు ఆందోళన పడొద్దన్నారు.కుటుంబ నిర్దారణ కానీ రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. రైతుల ఇంటి వద్దే కుటుంబ నిర్దారణ చేసి వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తారన్నారు.రూ.2 లక్షలకుపైగా లోన్లు ఉన్న రైతుల రుణమాఫీపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com