TG : తుమ్మిడిహట్టిపై బ్యారేజీ కడతాం : మంత్రి ఉత్తమ్

TG : తుమ్మిడిహట్టిపై బ్యారేజీ కడతాం : మంత్రి ఉత్తమ్
X

తుమ్మిడిహట్టిపై బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో స్పష్టం చేశారు. 3, 4 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అక్కడ ప్రాజెక్టు కడితే పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. 1.5 టీఎంసీల నీరు నిలిపేలా గంధమల్లలో పనులు ప్రారంభిస్తామని.. 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే మునిగిపోతుందని.. గంధమల్ల గ్రామస్థులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

Tags

Next Story