TG : రేషన్, పింఛన్ పై మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్

TG : రేషన్, పింఛన్ పై మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్
X

వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పౌరసరఫరాలు, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నామని, ఈ కార్డు ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తీసుకునే అవకాశం ఉందని, ఈ కార్డు ద్వారా పింఛన్ కూడా పొందవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణకు చెందిన ఎంతోమంది. మేస్త్రీలు, ఇతర కూలీలు జీవనోపాధి కోసం ముంబై, ఇతర ప్రాంతాలకు వెళతారని, తిరిగి వారి స్వగ్రామానికి వచ్చి పింఛన్, రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉండదని, అలాంటి వారు ఎక్కడినుంచైనా ఇవి పొందే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని, ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తామని ఉత్తమ్ చెప్పారు.

ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులు పూర్తి చేసేందుకు 4వేల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని, పాలమూరు రంగారెడ్డితోపాటు ఇతర ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.

Tags

Next Story