Minister Uttam Kumar : ప్రతి ఒక్కరికీ 6 కిలోల సన్నబియ్యం : మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar : ప్రతి ఒక్కరికీ 6 కిలోల సన్నబియ్యం : మంత్రి ఉత్తమ్
X

రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుం టలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం దర్బంగా మాట్లాడుతూ రేషన్ కార్డుల్లో పేరున్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో విప్లవాత్మ కమైన మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందని అన్నారు. ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికీ రేషన్ కార్డులు అంది స్తామని తెలిపారు. పెళ్లయిన వారికి విడిగా కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల మార్పు చేర్పులు అన్ని పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వం 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని అన్నారు. అందరికీ రేషన్ కార్డు అందిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్లందరికీ ఇల్లు కట్టించే ప్రక్రియ చేపట్టామని, ఇండ్ల మంజూరు జాబితాలో పేరు లేకుంటే దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. స్వంతస్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఎస్సీ ఎస్టీలకు మరో లక్ష ఆదనంగా ఇస్తామని తెలిపారు. సాగు చేసేందుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12000 రైతు భరోసా ఇవ్వబోతు న్నామని తెలిపారు. పంట వేసినా వేయకున్నా వ్య వసాయానికి ముఖ్యంగా ఉంటే రైతు భరోసా అం దుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి 12,000 అందజేస్తున్నామ ని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారం సరిగ్గా నింపకపోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. గ్రామసభ పూర్తయిన తర్వాత కూడా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వ వచ్చని అన్నారు. అన్ని దరఖాస్తులు పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాక ర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.

Tags

Next Story