TG : రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TG : రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు రోజుల్లో నీటి సరఫరా నిలిపి వెంటనే పునరుద్ధరణ పనులను చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. భారీ వర్షాల తాకిడికి నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రాపురం గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడి వందల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. ఆ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అంచనా మేరకు కట్టను వారం రోజుల్లో పునరుద్ధరించి నీటి సరఫరా యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. నీట మునిగి నష్టపోయిన పంట పొలాల వివరాలు అధికారుల ద్వారా సేకరించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పంట నష్ట పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు.

Tags

Next Story