Uttam Kumar Reddy : ఛత్తీస్ గఢ్ కు మంత్రి ఉత్తమ్.. సమ్మక్క సారక్క ప్రాజెక్టు noc పై చర్చ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశం సెప్టెంబర్25 న నిర్వహిస్తామని ఐఎంవో ఆశిష్ బెనర్జీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు, సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు సంబంధించిన NOC చర్చించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛత్తీస్ ఘడ్ సీఎంవో నుంచి కబురు అందింది. ఈ నెల 19న ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కోరగా, నేడు సాయంత్రం 4 గంటలకు భేటీ ఖరారైంది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్ ఘడ్ కు వెళ్లనున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com