TG : పేద విద్యార్థినికి మంత్రి వెంకట్ రెడ్డి సాయం

TG : పేద విద్యార్థినికి మంత్రి వెంకట్ రెడ్డి సాయం
X

ఎంబీబీఎస్ సీటోచ్చినా కూలీ పనులకు వెళ్తున్న మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం సలాబత్ పూర్ గ్రామానికి చెందిన కాట్రోజు సుమలత ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు. ప్రతిభావంతురాలైన సుమలత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డుగా మారకూడని మంత్రి అన్నారు. తాను సుమలతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సుమలతకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం చదువులకు కావల్సిన ఆర్ధిక సహాయం అందించారు. పుస్తకాలు, బట్టలు ఇతర ఖర్చులకూ ఆర్ధిక సహాయం చేశారు. మంచిగా చదువుకొని డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఏ ఇబ్బంది ఉన్నా తానున్నాని మంత్రి భరోసా కల్పించారు.

Tags

Next Story