TG : హెలికాప్టర్ లో మంత్రులు.. సభా ప్రాంగణంలో దుమ్ముదుమారం

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఇక్కడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కుప్పకూలింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల సమన్వయలోపం వల్లే ఈ ఘటన జరిగింది.
రైతు మహోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,ఉత్తమ్ కుమార్,జూపల్లి కృష్ణారావు,పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన చాపర్ సూచించిన చోట కాకుండా వేరే చోట ల్యాండ్ అయింది. కలెక్టరేట్ మైదానంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న గిరిరాజ కళాశాల మైదానంలో ల్యాండ్ అయింది. ఈ మైదానంలో కూడా హెలిప్యాడ్ ఉండటంతో కన్ఫ్యూజన్ కు గురయ్యారు. అధికారుల తీరుపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com