Vemulawada : వేములవాడకు మంత్రుల పట్టువస్త్రాలు

Vemulawada : వేములవాడకు మంత్రుల పట్టువస్త్రాలు
X

మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే జయశంకర్ భూపాల్ పలోని కాళేశ్వరముకటేశ్వర స్వామికి మంత్రి శ్రీధర్ బాబు, మెదక్ నాగసానిపల్లి ఏడుపాయల వన దుర్గా భవానికి దేవస్థానంలో మంత్రి దామోదర రాజ నర్సింహ, ములుగు రామలింగేశ్వర ఆలయంలో మంత్రి సీతక్క, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు స్వయంభూ శంభు లింగేశ్వర స్వామికి మంత్రి ఉత్తమకుమార్, నల్గొండ జిల్లా ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి కోమటిరెడ్డి, పాలకుర్తి సోమేశ్వర దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Tags

Next Story