Bathula Lakshma Reddy : కొడుకు రిసెప్షన్ క్యాన్సిల్ చేసి.. రైతుల కోసం రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు తమ నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం అరుదైన విరాళాన్ని ప్రకటించారు. రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 కోట్ల చెక్కును అందించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, తమ నియోజకవర్గంలో ఉన్న లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇటీవల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే రిసెప్షన్‌ను రద్దు చేసుకుని, ఆ ఖర్చును రైతుల కోసం ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. రైతుల పట్ల ఎమ్మెల్యే చూపిన ఈ ఔదార్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ విరాళం రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని, సమాజానికి ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com