Miss World 2025 Grand Finale : రేపే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే.. సోనీలో లైవ్ టెలికాస్ట్

మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. 109 దేశాల అందాల భామలతో ప్రారంభమైన ఈ పోటీలు దశలవారీగా జరిగాయి. హెడ్ టూ హెడ్, టాలెంట్, ప్యాషన్ ర్యాంపు పోటీల తర్వాత ప్రస్తుతం 24 మంది ఫైనల్ కు సిద్ధమయ్యారు. వివిధ దశల్లో ఎంపి కైన 20మంది అందగత్తెలతో పాటుగా ఖండాంతర పోటీల్లో గెలిచిన నలుగురు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు రెడీ అయ్యారు.
ఫైనల్ ఫినాలే ఈ నెల 31న హైదరాబాద్ లోని హైటెక్స్ గ్రాండ్స్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు పోటీలు జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈవెంట్ తిలకించేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే సామాన్యులకు అవకాశం కల్పి స్తున్నారు. పాసులకోసం దాదాపు 10 వేల దర ఖాస్తులు రాగా అందులో కేవలం 500మందిని ఎంపిక చేసి నట్లు తెలుస్తోంది. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నారు. ఫైనల్ పోటీలను 150దేశాల్లో ప్రత్యక్షప్రసారం చేయడానికి సోనీ టీవీ అనుమతి పొందినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com