MISS WORLD: పిల్లలమర్రి వద్ద సుందరీమణుల సందడి

మిస్ వరల్డ్ -2025 పోటీదారులు చేవెళ్ల సమీపంలోని ఎకో పార్కును సందర్శించారు. మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రిని సందర్శించారు. అందాల సుందరీమణులకు పిల్లలమర్రి చరిత్ర, విశేషాలను నాయకులు, అధికారులు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంత్రి జూపల్లి, నాయకులు, స్థానిక అధికారులు హాజరయ్యారు.
ఎకో పార్క్ సందర్శన
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఎకో టూరిజం పార్క్ ఎక్సీపీరియమ్‌లో మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. ఎకో పార్క్‌ను సృష్టించిన రాందేవ్ రావు వారికి పార్క్ విశేషాలను వివరించారు. మొత్తం 85 దేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఈ పార్కులో ఉన్నట్లు తెలిపారు. సొంత పరిజ్ఞానంతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పార్క్‌ను సందర్శించిన సుందరీమణులు చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. అందాల భామలు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను వారు ఆత్మీయంగా పలకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com