CM Revanth : మిషన్ పువ్వాడ... ఆక్రమణలపై రిపోర్ట్‌కు సీఎం రేవంత్ ఆదేశాలు

ఖమ్మంలో వరదలకు కారణాలను సీరియస్ గా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో రివ్యూ చేసిన సీఎం.. ఖమ్మం ముంపు బారిన పడడానికి మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలే కారణమని తనకు ఫిర్యాదులు అందాయన్నారు. పువవాడ ఇష్టారీతిగా కాలువలు ఆక్రమించారని, దాంతో ఖమ్మం ముంపు బారిన పడిందని స్థానికులు చెప్పారన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఆక్రమణల తొలగింపునకు హరీష్ రావు చిత్తశుద్దితో సహకరిస్తారా అని ప్రశ్నించారు.
పువ్వాడ ఆక్రమణలపై వాస్తవాలు వెలికితీయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తుపై రివ్యూ చేస్తామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రకృతిని చెరబడితే ఉత్తరాఖండ్ లోనైనా.. మన దగ్గరైనా విపత్తులు తప్పవన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com